ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 21:16:17

తెలంగాణలో ఇవాళ 253 కరోనా కేసులు

తెలంగాణలో ఇవాళ 253 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో శనివారం కొత్తగా 253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 8 మంది మృతిచెందారు. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,288కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,203 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 2,352 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 182 మంది కరోనా బారినపడి చనిపోయారు. 

ఒక్క హైదరాబాద్‌లోనే మరో 179 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి(24), మేడ్చల్‌(14), రంగారెడ్డి(11), మహబూబ్‌నగర్‌(4), వరంగల్ అర్బన్‌(2), వరంగల్‌ రూరల్‌(2), కరీంనగర్‌(2), నల్గొండ(2), ములుగు(2, సిరిసిల్ల(2), మంచిర్యాల(2) ఇవాళ కేసులు నమోదయ్యాయి. సిద్ధిపేట, ఖమ్మం, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నిర్ధారణ అయింది 


logo