సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 19:15:25

నల్లగొండ జిల్లాలో నేడు 25 కరోనా కేసులు..

నల్లగొండ జిల్లాలో నేడు 25 కరోనా కేసులు..

నల్లగొండ : కొంతకాలంగా నల్లగొండ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఇప్పుడు మళ్లీ పెరుగుతుండడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం 5 కేసులు నమోదు కాగా. శనివారం ఏకంగా 25 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం జిల్లాలో 71 కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో ఒక్కరు కరోనాతో మృతి చెందారు. హోం క్వారంటైన్‌లో 60 మంది ఉన్నారు. అయితే శనివారం నమోదైన కేసుల్లో ఎక్కువగా పోలీస్‌ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ గన్‌మెన్‌తో పాటు ఆఫీస్‌లో పనిచేసే మరో ముగ్గురికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. టూటౌన్‌ పీఎస్‌లోని ఒకరికి కూడా పాజిటీవ్‌ వచ్చినట్లు చెప్పారు. ఈ నెల23న 72 నమూనాలు సేకరించి టెస్టులు చేయగా అందులో 18 మందికి, 24వ తేదీన సేకరించిన నమూనాల్లో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.ఇంకా కొందరి ఫలితాలు రావాల్సి ఉందని వైద్య అధికారులు తెలిపారు. ఎక్కువగా నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్‌లో నియోజకవర్గాల్లో కేసులు ఉన్నట్లు తెలిసింది. 


logo