మంగళవారం 02 మార్చి 2021
Telangana - Dec 17, 2020 , 06:36:09

పాఠ‌శాల విద్యా‌శా‌ఖలో 25 వేల ఖాళీలు!

పాఠ‌శాల విద్యా‌శా‌ఖలో 25 వేల ఖాళీలు!

హైద‌రా‌బాద్: ఉపా‌ధ్యాయ పోస్టులు ఎన్ని ఖాళీ‌లు‌న్నాయి? ఎక్కడ ఎక్కు‌వ‌మంది పని‌చే‌స్తు‌న్నారు? సర్దు‌బాట్లు పోను ఖాళీల లెక్కపక్కాగా తేల్చేం‌దుకు పాఠ‌శాల విద్యా‌శాఖ కస‌రత్తు వేగ‌వంతం చేసింది. విద్యా‌ర్థుల సంఖ్యకు అను‌గు‌ణంగా ఉపా‌ధ్యా‌యుల నియా‌మకానికి ముమ్మర కసరత్తు మొదలైంది. పాఠ‌శాల విద్యా‌శా‌ఖలో అన్ని‌ర‌కాల పోస్టుల కలిపి దాదాపు 25 వేల ఖాళీ‌లు‌న్నట్టు అధి‌కా‌రులు అంచనా వేస్తు‌న్నారు. 

ఇందులో జిల్లా‌ల‌వా‌రీగా పదో‌న్న‌తులు పోను.. మిగి‌లిన పోస్టు‌లను డైరెక్ట్‌ రిక్రూ‌ట్‌‌మెంట్‌ ద్వారా భర్తీ చేయ‌ను‌న్నారు. ఉన్న ఖాళీ‌ల‌తో‌పాటు పదవీ విర‌మ‌ణలు, మర‌ణాల వల్ల కూడా ఖాళీలు ఏర్ప‌డు‌తు‌న్నా‌యని సమా‌చారం. టీచర్ల రేష‌న‌లై‌జే‌షన్‌ చేయా‌ల్సిన అవ‌సరం ఉంటుందా? లేదా? అన్న అంశంపై అధి‌కా‌రులు త్వర‌లోనే స్పష్టత ఇవ్వ‌ను‌న్నారు.

స్కూళ్ల అప్‌‌గ్రే‌డ్‌పై ముందే నిర్ణయం

విద్యా‌శా‌ఖలో టీచర్ల నియా‌మక ప్రక్రియ కంటే ముందే ఉన్నత పాఠ‌శా‌ల‌లను జూని‌యర్‌ కాలే‌జీ‌లుగా అప్‌‌గ్రేడ్‌ చేయ‌డంపై రాష్ర్ట ప్రభుత్వం తుది నిర్ణయం తీసు‌కో‌వాల్సి ఉన్న‌దని అధి‌కా‌రులు భావి‌స్తు‌న్నారు. ఆపై ఎక్కు‌వగా ఉన్న టీచ‌ర్లను సర్దు‌బాటు చేసి, విద్యా‌ర్థుల సంఖ్యను బట్టి టీచర్‌ పోస్టు‌లను ఖాళీ‌లుగా చూప‌ను‌న్నారు. మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, రంగా‌రెడ్డి, మెదక్‌ వంటి పలు జిల్లాల్లో ఎక్కువ టీచర్‌ పోస్టులు ఖాళీ‌లు‌న్నా‌యని సమా‌చారం. 

ప్రాథ‌మిక పాఠ‌శా‌లల బలో‌పే‌తా‌నికి ఎస్జీటీ పోస్టులు, ఉన్నత పాఠ‌శా‌లల్లో సబ్జెక్ట్‌ టీచర్‌ పోస్టులు అధిక సంఖ్యలో భర్తీ చేయ‌ను‌న్నారు. భాషా‌పం‌డి‌తులు, పీఈటీ టీచ‌ర్ల‌తో‌పాటు ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్ల‌లోని మెథ‌డా‌ల‌జీలో ఎస్జీటీ, స్కూల్‌ అసి‌స్టెంట్‌ పోస్టు‌లను భర్తీ‌చేసే అవ‌కా‌శాలు ఉన్నాయి. టీచర్ల నియా‌మకం కోసం ఖాళీ పోస్టుల వివ‌రాల సేక‌ర‌ణకు ముందే ఉపా‌ధ్యా‌యుల పదో‌న్న‌తులు, బది‌లీల ప్రక్రి‌యను పూర్తి‌చే‌యా‌లని విద్యా‌శాఖ అధి‌కా‌రులు భావి‌స్తు‌న్నారు. దీని‌వల్ల రాష్ర్టంలో దాదాపు 20 వేల‌కు‌పైగా ఉపా‌ధ్యా‌యు‌లకు ప్రయో‌జనం కలు‌గు‌తుంది.

VIDEOS

logo