ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 09:07:36

రాష్ట్రంలో కొత్త‌గా 2426 క‌రోనా కేసులు

రాష్ట్రంలో కొత్త‌గా 2426 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: ‌రాష్ట్రంలో కొత్త‌గా 2426 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరాయి. అదేవిధంగా క‌రోనా నుంచి నిన్న మ‌రో 2324 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,19,467 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. మ‌రో 32,195 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 25,240 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. కాగా, నిన్న మ‌రో 13 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మృతులు 940కి పెరిగారు. రాష్ట్రంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 78.2 శాతంగా ఉండ‌గా, క‌రోనా మ‌ర‌ణాల రేటు 0.61 శాతంగా ఉన్న‌దని వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. నిన్న ఒకేరోజే 62,890 మంది క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని వెల్ల‌డించింది.  

నిన్న రాత్రి 8 గంటల వ‌ర‌కు న‌మోదైనా పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 338 కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 216, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 172,  న‌ల్ల‌గొండ‌లో 164, క‌రీంన‌గ‌ర్‌లో 129, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 108,  ఖ‌మ్మం 98, సంగారెడ్డి 97, నిజామాబాద్ 89, సిద్దిపేట 87, సూర్యాపేట 78, మ‌హ‌బూబాబాద్ 76, భ‌ద్రాద్రికొత్త‌గూడెం 67, జ‌గిత్యాల 62, మంచిర్యాల 57, పెద్ద‌ప‌ల్లి 56, కామారెడ్డి 54, నాగ‌ర్‌క‌ర్నూల్ 50, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 46, యాదాద్రిభువ‌న‌గిరి 43, మెద‌క్ 42, రాజ‌న్న‌సిరిసిల్ల 41, వ‌న‌ప‌ర్తి 38, జ‌న‌గాం 33, జోగులాంబ గ‌ద్వాల 32, నిర్మ‌ల్ 32, ఆదిలాబాద్‌లో 25,  జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి 22, వ‌రంగ‌ల్ రూర‌ల్ 18, ములుగు 16, కొమురం భీమ్ ఆసిఫాబాద్ 15, నారాయ‌ణ‌పేట 14, వికారాబాద్ 11 చొప్పున ఉన్నాయి. 


logo