జోగులాంబ గద్వాల : జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. శనివారం 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,693 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 650 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2కు 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌నకు 315 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 540 క్యూసెక్కులు, కుడి కాలువకు 178 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. 110 క్యూసెక్కులు ఆవిరిగా నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలకుగానూ 7.682 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
భూ తగాదాలతో తండ్రీ, కొడుకుల దారుణ హత్య
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగు