గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 15:42:41

హేమంత్ ఇంటి వ‌ద్ద 24 గంట‌ల భ‌ద్ర‌త

హేమంత్ ఇంటి వ‌ద్ద 24 గంట‌ల భ‌ద్ర‌త

హైద‌రాబాద్ : త‌న‌తో పాటు హేమంత్ త‌ల్లిదండ్రుల‌కు నిందితుల నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని అవంతి సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌కు ఇవాళ ఉద‌యం ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై సీపీ స‌జ్జ‌నార్ సానుకూలంగా స్పందించారు. చందాన‌గ‌ర్‌లోని హేమంత్ ఇంటి వ‌ద్ద 24 గంట‌ల భ‌ద్ర‌త ఏర్పాటు చేయాల‌ని స్థానిక పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుల‌కు త్వ‌ర‌గా శిక్ష ప‌డేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీపీకి అవంతి విజ్ఞ‌ప్తి చేసింది. 

పోలీసుల క‌స్ట‌డీలో ల‌క్ష్మారెడ్డి, యుగంధ‌ర్ రెడ్డి 

రాష్ర్ట వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హేమంత్ హ‌త్య కేసులో గ‌చ్చిబౌలి పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఈ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితులైన అవంతి తండ్రి ల‌క్ష్మారెడ్డి, మేన‌మామ యుగంధ‌ర్‌రెడ్డిని పోలీసులు త‌మ క‌స్ట‌డీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిద్ద‌రికి ఆరు రోజుల క‌స్ట‌డీకి కోర్టు అనుమ‌తిచ్చిన నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం వారిని చ‌ర్ల‌పల్లి జైలు నుంచి గ‌చ్చిబౌలి పోలీసు స్టేష‌న్‌కు తీసుకొచ్చారు. 


logo