ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 01:22:10

వెలుగు జిలుగుల తెలంగాణ

వెలుగు జిలుగుల తెలంగాణ

  • గృహ, వాణిజ్య, పారిశ్రామికరంగాలకు 24 గంటలు విద్యుత్‌
  • 22,556 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
  • దేశ సగటు కంటే అధికంగా తలసరి విద్యుత్‌ వినియోగం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వేసవి వచ్చిందంటే నగరాల్లో ఉదయం, సాయంత్రం కరెంటు కోత.. గ్రామాల్లో ఏ రోజైనా ఏకధాటిగా 12 గంటలపాటు కరెంటు ఉంటే నాడు పండుగే.. వ్యవసాయ పంపులకు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని స్థితి. ఇక పరిశ్రమలకు పవర్‌ హాలిడేస్‌ ప్రకటించి వారానికి రెండురోజులు మూసివేసే పరిస్థితి.. ఇదంతా జూన్‌ 2, 2014కు పూర్వం తెలంగాణలో ఉన్న పరిస్థితి. నేడు నగరాల్లోనే కాదు.. గ్రామాల్లో కూడా ఒక్క గంట కరెంటు పోయినా వార్తే. వ్యవసాయానికి సైతం 24 గంటలూ ఉచితంగా కరెంటు అందుతున్నది. విద్యుత్‌ రంగం నాడు ఉన్న వాటికే కాదు.. నేడు కొత్తగా వస్తున్న పరిశ్రమలకు సైతం చాలినంత కరెంటు ఇవ్వగల స్థితికి చేరుకుంది. 

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గదర్శనంలో.. అలుపెరుగకుండా, నిరంతరం కొత్త ఉత్సాహంతో.. విద్యుత్‌రంగం నేడు ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థల్లో వచ్చిన మార్పులతో రాష్ట్ర విద్యుత్‌ రంగం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది. విద్యుత్‌ సంస్థలకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సహకారంతోనే ఆరేండ్లలో ఈ అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. 22,556 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. విశ్వవ్యాప్తంగా ప్రగతి సూచికలుగా గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్‌ వినియోగం ఒకటి. 

దేశవ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్‌ వినియోగం 1,181 యూనిట్లు కాగా, తెలంగాణలో ప్రస్తుతం 1,896 యూనిట్లుగా ఉన్నది. ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థల పటిష్ఠానికి ప్రభుత్వం రూ.27,771 కోట్లు ఖర్చు చేసింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేసి, తెలంగాణ రాష్ర్టాన్ని మిగులు    విద్యుత్‌ రాష్ట్రంగా మార్చాలనే సీఎం కేసీఆర్‌ కలను నిజం చేసేందుకు విద్యుత్‌ సంస్థల ఇంజినీర్లు, అధికారులు, సిబ్బంది, కార్మికులు అందరూ.. ఒక బృం దంగా పనిచేస్తున్నారని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. 

విద్యుత్‌ రంగంలో సాధించిన ప్రగతి గణాంకాలు..

అంశం
2.6.2014
1.5.2020 నాటికి
స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం (మెగావాట్లలో)
777815980
సౌర విద్యుత్‌ సామర్థ్యం (మెగావాట్లలో)
74
3680.51
గరిష్ఠ విద్యుత్‌ వినియోగం (మిలియన్‌ యూనిట్లలో)
128255.34 
400, 220, 132, 33 కేవీ సబ్‌ స్టేషన్లు
2411
3379
మొత్తం ఈహెచ్‌టీ సబ్‌ స్టేషన్లు
233350
విద్యుత్‌ లైన్ల పొడవు (లక్షల కి.మీ.లలో)
4.38
5.67
వ్యవసాయ కనెక్షన్లు (లక్షల్లో)
19.03
24.46logo