బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 01:21:01

జూలై 2న సింగరేణిలో 24 గంటల సమ్మె

జూలై 2న సింగరేణిలో 24 గంటల  సమ్మె

  • బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణపై రాజీలేని పోరాటం 
  • 26న కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనం
  • టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 

హైదరాబాద్‌/మంచిర్యాల, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా 42 బొగ్గు గనులను ప్రైవేటుపరం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం కార్మికులకు, సింగరేణికి ద్రోహం చేసే అంశమని టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ నెల 26న సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్టుమెంట్ల వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేస్తామని వెల్లడించారు. జూలై 2న 24 గంటలపాటు సమ్మె నిర్వహించి కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని కేంద్రందృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 

కేంద్రం నిర్ణయం దారుణం: మిర్యాల రాజిరెడ్డి

బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయం దారుణమనీ, ఇది కేవలం విదేశీ, ప్రైవేటు వ్యక్తులకు ఎర్ర తివాచీ పరిచి కార్మికులకు ద్రోహం చేసే చర్య అని తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో ప్రభుత్వరంగ సంస్థలైన కోల్‌ఇండియా, సింగరేణి నష్టపోతాయని ఆవేదన వ్యక్తంచేశారు.  


logo