గ్రీన్ టీ, బ్లాక్ టీ, రెడ్ టీ ఇలా చాలా రకాల టీలను మీరు టేస్ట్ చేసి ఉంటారు. కానీ మీకు బ్లూ టీ గురించి తెలుసా ? దీన్ని బటర్ ఫ్లై పీ ఫ్లవర్ టీ అని కూడా చాలా ప్రాంతాల్లో పిలుస్తారు. మిగతా వాటికన్నా ఈ బ్లూ టీ చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు ఈ టీ వల్ల బోలిడెన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇంతకీ ఈ బ్లూ టీని ఎలా తయారుచేస్తారంటే అపరాజిత పుష్పాలతో . ఇంగ్లీషులో ఈ పూలను Clitoria ternatea అంటారు. బ్లూ టీలో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువ. అలాగే యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. తద్వారా వయసు ఎక్కువగా ఉన్నా కనిపించదు. దీన్ని డైలీ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయంలో పిత్తరస ఉత్పత్తికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి బ్లూ టీ దోహద పడుతుంది. వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు. బ్లూ టీలో ఉంటే అంతేకాదు మంచి నిగారింపు వస్తుంది. బ్లూ టీలో ఉండే ఆంథోసైనిన్ వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఈ టీ చాలామంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. రెగ్యులర్ బ్లూ టీని క్రమం తాగడం వల్లన క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది. మెదడుని ఉత్తేజంగా ఉంచుతుంది. దానివల్ల మీరు డిఫ్రెషన్ లోకి వెళ్లే ఛాన్సే ఉండదు.