గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - May 17, 2020 , 22:27:44

రూ.150 కోసం స్నేహితుడిని చంపేశాడు...

రూ.150 కోసం స్నేహితుడిని చంపేశాడు...

ముంబై: రూ.150 కోసం తన స్నేహితుడిని హత్య చేశాడు ఓ హంతకుడు... కేసు వివరాల్లోకి వెళితే మృతుడు రియాజ్‌ షేక్‌(25) అనే వ్యక్తి హుస్సెన్‌(25) నుంచి రూ.150 అప్పుగా తీసుకున్నాడు. అయితే ఈ రోజు ఇద్దరు మిత్రులు కలిసి సిమెంట్‌ పైప్‌లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. హుస్సెన్‌ తనకు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వాల్సింగా రియాజ్‌ను అడిగాడు. దానికి రియాజ్‌ తన దగ్గర డబ్బులు లేవని ఇప్పడు ఇవ్వలేనని చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోయిన నిందితుడు రియాజ్‌ తలపై బండరాయితో మోది హత్య చేశాడు.

 ఉదయం వెళ్లిన వ్యక్తి కనిపించకపోవడంతో రియాజ్‌ సోదరుడు షఫీక్‌ షేక్‌  సివ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడి సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా, బీపీసీఎల్‌ కంపెనీ సమీపంలోని సిమెంట్‌ పైప్‌లో మృతదేహాన్ని కనుగొన్నారు. నిందితుడు హుస్సెన్‌ను బౌచాదుక్కా సమీపంలో బోటులో దాక్కుని ఉండగా అదుపులోకి తీసుకుని విచారించారు. తీసుకున్న డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తానే హత్య చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా, కోర్టు పోలీసు విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించింది. 


logo