శనివారం 06 జూన్ 2020
Telangana - Apr 30, 2020 , 21:48:56

తెలంగాణలో కొత్తగా 22 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 22 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,038కి చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 568. కాగా కోవిడ్‌-19 కారణంగా ఇవాళ ముగ్గురు మృతిచెందారు. తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 28కి చేరింది. వ్యాధి నుంచి కోలుకుని ఇవాళ 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 442 మంది కరోనా బాధితులు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 



logo