శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 02:22:10

రాష్ట్రంలో 22.2 లక్షల కరోనా టెస్టులు

రాష్ట్రంలో 22.2 లక్షల కరోనా టెస్టులు

  • సోమవారం 51,247 మందికి పరీక్షలు
  • కొత్తగా 2,058 మందికి వైరస్‌ పాజిటివ్‌
  • 2,180 మంది డిశ్చార్జి, పదిమంది మృతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 22.20 లక్షల పరీక్షలు నిర్వహించినట్టు మంగళవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. ఇందులో 1.6 లక్షల మందికి వైరస్‌ సోకగా, 1.29 లక్షల మంది (80.45%) కోలుకున్నారు. సోమవారం 51,247 టెస్టులు నిర్వహించగా, 2,058 మందికి పాజిటివ్‌గా తేలింది. జీహెచ్‌ఎంసీలోనే 277 కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 143, కరీంనగర్‌ 135, వరంగల్‌ అర్బన్‌ 108, సిద్దిపేట 106, ఖమ్మం 103, మేడ్చల్‌ మల్కాజిగిరి 97, నల్లగొండ 96, నిజామాబాద్‌ 84, భద్రాద్రి కొత్తగూడెం 75, మహబూబాబాద్‌ 68, సూర్యాపేట 62, యాదాద్రి భువనగిరి 53, జగిత్యాల 52, పెద్దపల్లి 48, రాజన్న సిరిసిల్ల 45, కామారెడ్డి 43, నిర్మల్‌, నాగర్‌కర్నూల్‌లలో 42 చొప్పున, మంచిర్యాల 41, మెదక్‌, మహబూబ్‌నగర్‌లలో 38 చొప్పున, ములుగు 36, జనగామ 30, జోగుళాంబ గద్వాల 29, జయశంకర్‌ భూపాలపల్లి 28, వికారాబాద్‌, సంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లలో 24 చొప్పున, వనపర్తిలో 23, ఆదిలాబాద్‌లో 20, నారాయణపేటలో 13, వరంగల్‌ రూరల్‌లో 11 కేసులు నమోదయ్యాయి.  


logo