మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 22:13:31

తెలంగాణలో కొత్తగా 219 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 219 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 219 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొత్తగా 189 కేసులు నమోదు అయ్యాయి.

రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్‌ అర్బన్‌లో 4, వరంగల్‌ రూరల్‌లో 3, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో రెండు చొప్పున, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి. సోమవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5193..  కాగా, మృతుల సంఖ్య 187. 


logo