మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 08:51:14

తెలంగాణలో కొత్తగా 2173 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2173 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2,173 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,79,246 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా 2004 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. మొత్తం 1,48,139 మంది బాధితులు ఇండ్లకు వెళ్లారు. వైరస్‌ ప్రభావంతో కొత్తగా 8 మంది మృత్యువాతపడగా.. ఇప్పటికీ 1070 మంది మరణించారు. రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల రేటు 0.59శాతం ఉందని, రికవరీ రేటు 81.42శాతంగా ఉందని వైద్యశాఖ తెలిపింది.

మరో 23,929 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. బుధవారం ఒకే రోజు 55,318 టెస్టులు చేయగా.. మొత్తం 26,84,215 శాంపిల్స్‌ పరీక్షించినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో 308 అత్యధికంగా ఉండగా.. రంగారెడ్డిలో జిల్లాలో 168, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 151, నల్గొండలో 136, కరీంనగర్‌లో 120, సిద్దిపేటలో 95, భద్రాద్తి కొత్తగూడెంలో 88, ఖమ్మంలో 86, సూర్యపేటలో 82 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo