ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 22:38:14

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 213 కరోనా కేసులు

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 213 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 213  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 165 మందికి, మెదక్‌ జిల్లాలో 13, మేడ్చల్‌ 3, జనగామ 1, ఆసిఫాబాద్‌ 1, కామారెడ్డి 1, భవనగిరి 1, సంగారెడ్డి 2, రంగారెడ్డి 16, నిజామాబాద్‌ 2 కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5406కు చేరుకుంది. కోవిడ్‌ 19 కారణంగా ఈ రోజు నలుగురు మృతి చెందారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలో 191 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఈ రోజు రాష్ట్రంలో 1251 మంది కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 44,431 మందికి కరోనా పరీక్షలు జరిగాయి. ఈ రోజు చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకుని 261 మంది బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 3027 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 2188 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 


logo