బుధవారం 03 జూన్ 2020
Telangana - May 03, 2020 , 21:19:17

తెలంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో ఆదివారం కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన వాటితో మొత్తం కేసుల సంఖ్య 1082కు పెరిగింది.  ఇవాళ ఒక్కరోజే 46 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకూ 29 మంది కరోనా వల్ల చనిపోయారు. తెలంగాణలో ప్రస్తుతం 508 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ జీహెచ్‌ఎంసీ పరిధిలో 20, జగిత్యాల జిల్లాలో ఒక కేసు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదివారం రాత్రి వరకు రాష్ట్రంలో 545 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.  


logo