శనివారం 30 మే 2020
Telangana - May 04, 2020 , 00:52:35

కొత్తగా 21 పాజిటివ్‌ కేసులు

కొత్తగా 21 పాజిటివ్‌ కేసులు

  • 46 మంది డిశ్చార్జి.. 508 మందికి చికిత్స

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 20, జగిత్యాలకు చెందిన ఒకరున్నారు. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,082కు చేరింది. 29 మంది మృతి చెందగా, 545 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 508 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్యశాఖ బులెటిన్‌ విడుదలచేసింది. ఆదివారం డిశ్చార్జి అయిన వారిలో వివిధ అరోగ్య సమస్యలతో ఉన్న 68 ఏండ్ల వృద్ధు డు ఉన్నారు. రా జన్న సిరిసిల్ల, నల్లగొండ జిల్లా ల్లో ఆదివారం పలు కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తివేశారు. 

ఏపీలో కొత్తగా 58 పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం కొత్తగా 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,583కు చేరిం ది. కర్నూలు జిల్లాలో తాజాగా ఓ  ఐఏఎస్‌ అధికారికి పాజిటివ్‌ వచ్చింది. మరో ఐఏఎస్‌ అధికారి  హోం క్వారంటైన్‌కు వెళ్లారు. 

రాష్ట్రంలో కేసుల వివరాలు

వివరాలు
ఆదివారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
211,082  
కోలుకున్న/డిశ్చార్జి అయినవారు
46
545
మరణాలు
-29
చికిత్స పొందుతున్నవారు
-508logo