బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Aug 07, 2020 , 01:12:28

రికవరీ రేటు.. 71.3%

రికవరీ రేటు.. 71.3%

  • బుధవారం కోలుకున్నది 1,289 మంది
  • ఒక్కరోజే 21,346 నిర్ధారణ పరీక్షలు
  • 5.43 లక్షలు దాటిన కరోనా టెస్టులు
  • కొత్తగా 2,092 మందికి పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు 71.3 శాతంగా నమోదైంది. మరోవైపు నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. బుధవారం 21,346 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్టుల సంఖ్య 5,43,489కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ గురువారం విడుదలచేసిన బులెటిన్‌లో పేర్కొన్నది. తాజాగా 2,092 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జీహెచ్‌ఎంసీలోనే 535 కేసులు రికార్డయ్యాయి. 

రంగారెడ్డి జిల్లాలో 169, వరంగల్‌ అర్బన్‌లో 128, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 126, కరీంనగర్‌లో 123, సంగారెడ్డిలో 101, నిజామాబాద్‌లో 91, రాజన్న సిరిసిల్లలో 83, జోగుళాంబ గద్వాలలో 72, ఖమ్మంలో 64, పెద్దపల్లిలో 54, నల్లగొండలో 52, మహబూబ్‌నగర్‌లో 48, మంచిర్యాలలో 43, భద్రాద్రి కొత్తగూడెంలో 36, సూర్యాపేట, వనపర్తిలలో 34 చొప్పున, జగిత్యాల, కామారెడ్డిలలో 28 చొప్పున, ములుగులో 27, జనగామలో 26, నిర్మల్‌లో 25, వరంగల్‌ రూరల్‌లో 24, నాగర్‌కర్నూల్‌లో 22, జయశంకర్‌ భూపాలపల్లిలో 21, సిద్దిపేటలో 20, మెదక్‌లో 18, ఆదిలాబాద్‌లో 17, మహబూబాబాద్‌లో 16, యాదాద్రి భువనగిరిలో 12, వికారాబాద్‌లో 9, నారాయణపేటలో 6 కేసులు నమోదయ్యాయి. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 13 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 589కి చేరుకున్నది. ఇక బుధవారం 1,289 మంది రికవరీ కాగా, ఇప్పటివరకు మొత్తం 52,103 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
బుధవారం
మొత్తం
పాజిటివ్‌కేసులు
2,092
73,050  
డిశ్చార్జి అయినవారు
1,289
52,103
మరణాలు
13589
చికిత్స పొందుతున్నవారు
-20,358


 


logo