శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 01:56:16

ఒక్క రోజే.. 206 కేసులు

ఒక్క రోజే.. 206 కేసులు

  • 10 మంది మృతి
  • జీహెచ్‌ఎంసీలోనే 152 మందికి పాజిటివ్‌
  • 83 మంది డిశ్చార్జి.. 1,663 మందికి చికిత్స
  • బుగులు పుట్టిస్తున్న కరోనా వైరస్‌ మరణాలు
  • లక్షణాలుంటే ప్రభుత్వ వైద్యులను సంప్రదించండి
  • ప్రజారోగ్యశాఖ అధికారుల సూచన

రాష్ట్రంలో కరోనా కేసులు బుగులు పుట్టిస్తున్నాయి. శనివారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 206 మంది వైరస్‌ బారినపడగా, ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 152 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తున్నది. వైరస్‌తో దవాఖానలో చేరి చికిత్స పొందుతున్నవారిలో 10 మంది మృత్యువాతపడటం మరింత భయపెడుతున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మే నెల చివరివారం నుంచి అధిక సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిసిగిస్తున్నది. ఎన్నడూ లేనివిధంగా శనివారం రాష్ట్రంలో 206 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీనికి తోడు పలు అనారోగ్య సమస్యలు, వైరస్‌ ప్రభావం ఆలస్యంగా బయటపడటం వంటి కారణాలతో పలువురు మరణిస్తుండటం వణుకు పుట్టిస్తున్నది. కొత్తగా నమోదైన 206 కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 152 ఉండటం గమనార్హం. రంగారెడ్డి 10, మేడ్చల్‌ మల్కాజిగిరి 18, నిర్మల్‌ 5, యాదాద్రి భువనగరి 5, మహబూబ్‌నగర్‌ 4, మహబూబాబాద్‌ 1, జగిత్యాల 2, వికారాబాద్‌ 1, జనగామ 1, నాగర్‌కర్నూల్‌ 2, జోగుళాంబ గద్వాల 1, నల్లగొండ 1, భద్రాద్రి కొత్తగూడెం 1, కరీంనగర్‌ 1, మంచిర్యాల 1 ఉన్నాయి. 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన నాటినుంచి మరణాల శాతం తక్కువగా నమోదు కాగా, మే 5 తర్వాత వాటి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఎన్నడూ లేనివిధంగా శనివారం 10 మంది వైరస్‌ ప్రభావం తో మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రం లో మరణాల సంఖ్య 123 కు చేరింది. కరోనా పాజిటివ్‌తోపాటు పలు అనారోగ్య సమస్యలు ఉండటం, ముందుగా వ్యాధి లక్షణాలను గుర్తించకపోవడం, వంటి ఇబ్బందుల వల్లే మృత్యువాత పడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసు ల సంఖ్య 3,496కు చేరింది. వీరిలో 1,710 మంది చికిత్స ద్వారా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 1,663 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజారోగ్యశాఖ సూచిస్తున్నది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. ఇతర జిల్లాల్లోనూ వైరస్‌ వెలుగుచూస్తున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని తీవ్రమైన శ్వాస సంబంధ సమ స్య (ఎస్‌ఏఆర్‌ఐ), జలుబు, దగ్గు, జ్వరం (ఐఎల్‌ఐ) లక్షణాలున్నవారు ఆలస్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులను సంప్రదించాలని సూచించింది. వైద్యుల సలహా మేరకు మందులువాడాలని, వైరస్‌ సోకినా, మరణాలు సంభవించినా.. ఆ ఇంట్లోనివారు బయటకు వెళ్లవద్దని ప్రజారోగ్యశాఖ కోరింది. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తమకు సహకరించాలని విజ్ఞప్తిచేసింది. 


ఏపీ సీఎం పేషీలో అధికారి డ్రైవర్‌కు కరోనా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్‌ సహా, ఐదుగురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో ఏపీ సచివాలయంలో కరోనా పాజిటివ్‌గా తేలినవారి సంఖ్య 10కి చేరింది. సచివాలయంలో పొరుగు సేవలపై కమాండ్‌కంట్రోల్‌లో పనిచేసే ఒక ఉద్యోగికి, ప్రణాళిక విభాగంలో డ్రైవర్‌కు, పరిశ్రమల శాఖలో మరో ఉద్యోగికి, సీఎం బ్లాక్‌లో ఆర్‌టీజీఎస్‌లో పనిచేసే సర్వీస్‌ ప్రొవైడర్‌కు, ఉన్నత విద్యాశాఖలో డేటా ఎంట్రీ అపరేటర్‌కు కరోనా సోకినట్టు తేలింది. 

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
శనివారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
2063,496  
డిశ్చార్జి అయినవారు
831,710
మరణాలు
10123
చికిత్స పొందుతున్నవారు
-1,663


logo