బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 08:54:43

తెలంగాణలో 1.60లక్షలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో 1.60లక్షలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,058 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,60,571కు చేరింది. తాజాగా మరో 2,180 మంది కోలుకోగా.. 1,29,187 మంది ఇండ్లకు చేరుకున్నారని చెప్పింది. వైరస్‌ ప్రభావంతో మరో 10 మంది మృత్యువాతపడగా.. ఇప్పటి వరకు 984 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,400 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా ఉండగా, రికవరీ రేటు 80.45శాతంగా ఉందని వివరించింది. 23,534 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. సోమవారం 51,247 నమూనాలు పరిశీలించగా, మొత్తం 22,20,586 టెస్టులు చేసినట్లు తెలిపింది. ఇంకా 908 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 277, రంగారెడ్డిలో 143, కరీంనగర్‌లో 135, వరంగల్‌ అర్బన్‌ 108, సిద్దిపేట 106, ఖమ్మం 103, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 97 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo