గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 08:11:06

1971 క్యాలెండర్‌ రిపీట్‌..

1971 క్యాలెండర్‌ రిపీట్‌..

హైదరాబాద్‌: ‘చరిత్ర పునరావృతమవుతుంది’ అనే నానుడి మనం తరచూ వింటూ ఉంటాం. బట్టలు, ఆహార పదార్థాలు, నిర్మాణాలు, కరోనా వంటి మహమ్మారుల విషయంలో ఇది నిజమవుతూనే ఉంది. పాత కాలంలో మన పూర్వీకులు వేసిన దుస్తులు, హేర్‌ కటింగ్‌ స్టైల్‌నే ఇప్పుడు మనం సరికొత్త ట్రెండ్‌గా ఫాలో అవుతున్నాం. ఇలానే ప్రతి ఏడాది కొన్ని సంఘటనలు జరుగుతాయి. అచ్చం క్యాలెండర్‌లో కనిపించే వాటిలాగే..! 

1971లో వచ్చిన క్యాలెండరే ఇప్పుడు రిపీట్‌ అయ్యింది. అవును అచ్చుగుద్దినట్లుగా ప్రతి నెల, ప్రతిరోజు 50 ఏండ్ల క్రితం నాటి క్యాలెండర్‌లో ఎలా ఉన్నాయో ఇప్పుడూ అవే ఉన్నాయి. సోషల్‌ మీడియాలో 1971 క్యాలెండర్‌పై చర్చనడవడానికి కూడా కారణం అదే. ఇలా గత 120 ఏండ్లలో 12 క్యాలెండర్‌లు 2021తో సరిపోలుతున్నాయి. 

50 సంవత్సరాల క్రితం క్యాలెండర్‌లో అంటే 1971, జనవరి 1 శుక్రవారమే అయ్యింది. ఇప్పుడు 2021 కూడా శుక్రవారంతోనే ప్రారంభమయ్యింది. రెండేండ్ల చివరి రోజు అంటే కూడా శుక్రవారం కావడం విశేషం. ఇలా ఏడాది మొదటి, చివరి రోజు మాత్రమే కాదు, అన్ని నెలలో ప్రతిరోజు తేదీలు,  సమయాలు సరిగ్గా ఒకే విధంగా ఉన్నాయి. 

2021 క్యాలెండర్‌తో కేవంలం 1971  క్యాలెండరే కాకుండా.. మరో 11 సంవత్సరాల క్యాలెండర్లతో సారుప్యతలు ఉన్నాయి. అవి 1909, 1915, 1926, 1937, 1943, 1954, 1965, 1982, 1993, 1999, 2010. ఇదే క్యాలెండర్ మళ్లీ ఆరేండ్ల తర్వాత అంటే 2027లో కనిపిస్తుంది. అదేవిధంగా 2038లో, 2049, 2055, 2066, 2077, 2083, 2094, 2100లో ఇదే తరహా క్యాలెండర్‌ రానుంది. 

తాజావార్తలు


logo