మహోన్నత కీర్తిశిఖరం అంబేద్కర్ : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ అర్బన్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసిన గొప్ప మేధావి అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశంసించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఆవరణలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మేయర్ గుండా ప్రకాష్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
నాడు రాజ్యాంగాన్ని రాసే కమిటీలో 7 గురు సభ్యులు ఉండగా, ఒక్కొక్కరు ఒక్కో కారణంతో అందుబాటులో లేకపోవడంతో ఒంటిచేత్తో రాజ్యాంగం రాసిన ఒకే ఒక్కడు అంబేద్కర్ అని చెప్పారు. భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తిశిఖరం అని అంబేద్కర్ సేవలను కొనియాడారు. గణతంత్ర దినోత్సవం రోజే బాబా సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. దేశ మొదటి న్యాయ శాఖ మంత్రి అయిన అంబేద్కర్, అంటరానితనాన్ని, అనేక అవమానాలను అధిగమించి మహోన్నత వ్యక్తిగా ఎదిగాడన్నారు.
ప్రపంచంలో ఎవరూ చదవనంతగా చదివి అనేక డిగ్రీలు పొందాడు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయ నేతగా, సంఘసంస్కర్తగా అంబేద్కర్ చేసిన కృషి చాలా గొప్పన్నారు. సీఎం కెసీఆర్ కూడా గొప్ప అంబేడ్కర్ వాది. సీఎం కెసీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో, ఆయన ఆశయాలకు అనుగుణంగా అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు సబ్ ప్లాన్ పెట్టి, బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు.
కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, తాటికొండ రాజయ్య, పలువురు కార్పొరేటర్లు, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ హనుమంత్ గాంధీ నాయక్ వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ విగ్రహాన్ని రూపొందించిన కళాకారుడిని మంత్రి సత్కరించారు. పలు సంస్థల క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఇతర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
తాజావార్తలు
- విరాట్ @100 మిలియన్ల ఫాలోవర్స్
- బెంగాల్ మంత్రుల కోడ్ ఉల్లంఘన: ఈసీకి బీజేపీ లేఖ
- బెంగాల్ పొత్తులు నెహ్రూ-గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం
- ఎన్ఎస్ఈలో లోపం అనూహ్యం.. బట్!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల బిడ్లు!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం