సత్తా చాటితేనే సర్కారు కొలువు

యాదాద్రి భువనగిరి : సర్కారు కొలువు సాధించాలంటే అన్ని రంగాల్లో సత్తా చాటాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు పోలీసులుగా ఎంపికయ్యేందుకు వారి కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగ అర్హతకు అవసరమైన శిక్షణ పొందేందుకు ఆసక్తి ఉన్న వారిలో శారీరక, మానసిక అర్హతలు ఉంటేనే ఎంపిక చేయాలని నిబంధన విధించారని తెలిపారు.
ఫిజికల్ ఫిట్నెస్తో పాటు రాత పరీక్షలో రాణించాలన్నారు. ప్రభుత్వం కళాశాలల్లో ఇంటర్ విద్యతో పాటు ఉద్యోగ కల్పనకు నిత్యం సాధన కూడా చేయిస్తుందన్నారు. సర్కారు కొలువుల కోసం యువత ఏండ్లుగా సిద్ధమౌతున్నారని, పోలీసు ఉద్యోగాల భర్తీ ఎక్కువగా జరుగతుందని, త్వరగా స్థిరపడాలనుకునే వారికి పోలీసు శాఖ సరైన వేదికగా నిలుస్తుందన్నారు. నిత్యం సాధన చేస్తేనే ఉద్యోగం సిద్ధిస్తుందన్నారు. కార్యక్రమంలో యాదాద్రి జిల్లా ఇంటర్ విద్యాధికారిణి సి రమణి, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మార్కెట్ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, సీఐ నర్సయ్య, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాజన్న, ఎస్సై రమేశ్, ఎన్ఎస్ఎస్ అధికారిణి గీతారాణి, పీఈటీ పూల నాగయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ. 64,92,590
గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్ రెడీ
హర్భజన్‌ను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్
సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి?
తాజావార్తలు
- ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్..సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్
- భవన నిర్మాణ ప్రదేశంలో మొసలి ప్రత్యక్షం..!
- కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో బీజేపీ చెప్పాలి: మంత్రి హరీశ్ రావు
- విటమిన్ బి6 మనకు ఎందుకు అవసరమంటే..?
- బీజేపీ పాలన.. బ్రిటీషర్లను మించిపోయింది: కేజ్రీవాల్
- బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : ఎమ్మెల్సీ కవిత
- ఒక్క మెడికల్ కాలేజీ, పసుపు బోర్డు తీసుకురాలేదు: మంత్రి ఎర్రబెల్లి
- టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్తే ఏషియా కప్ వాయిదా
- మళ్లీ కొలతూర్ నుంచే స్టాలిన్ పోటీ
- ఇస్రోతో దేశ ఖ్యాతి వర్ధిల్లుతున్నది : సీఎం కేసీఆర్