శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Jan 20, 2021 , 18:31:51

యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం

యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం

యాదాద్రి భువనగిరి : పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నిత్య కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం వేకువజామునే స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన నారసింహహోమం అనంతరం శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం జరిపారు. 

స్వామివారి అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి రోజు ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తున్నారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీసత్యనారాయణ స్వామివారి వత్ర పూజల్లో భక్తులు పాల్గొన్నారు.  

ఇవి కూడా చదవండి..

గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్‌ రెడీ

హ‌ర్భ‌జ‌న్‌ను వ‌దులుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్‌

సీఎం ప‌ద‌వికి కేటీఆర్ స‌మ‌ర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి? 


VIDEOS

logo