సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 18, 2021 , 20:36:59

జనం మెచ్చిన గళం గోరటి వెంకన్నది

జనం మెచ్చిన గళం గోరటి వెంకన్నది

నాగర్‌కర్నూల్‌ : ఆట, పాట, పద్యం, యక్షగానం, కవిత్వాన్ని తన గళంతో ప్రపంచాన్నే మెప్పించిన గొప్ప వ్యక్తి గోరటి వెంకన్న అని ఎంపీ రాములు, విప్‌ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కొనియాడారు. సోమవారం ఎంజేఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్‌లో ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, జెడ్పీ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి బంగారయ్యలకు ఆత్మీయ సన్మానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ పోతుగంటి రాములు, విప్‌ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, సంగీత, నాటక కళాశాల ప్రొఫెసర్‌ కోయి కోటేశ్వర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వారిని మెమోంటో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. గొప్ప వ్యక్తిత్వం గల కవి ఈ ప్రాంతంలో పుట్టడం మన అదృష్టంగా భావించాలన్నారు. తన ఆటపాటలు, పద్యం, కవిత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చెప్పి మంచి గుర్తింపు పొందారన్నారు. అందుకే గవర్నర్‌ కోటాలో గోరటికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినట్లు తెలిపారు.

అంతకుముందు జిల్లా కేంద్రంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి, పూర్ణకుంభంతో సన్మాన వేదిక వద్దకు గోరటిని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కళాకారులు ఆటపాటతో అలరింపజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్‌యాదవ్‌, కళాకారుడు సాయిచంద్‌, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య, సభ్యులు దినకర్‌, టీఆర్‌ఎస్‌, దళిత నాయకులు పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండి..

కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండం

పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధుల పాత్ర భేష్ 

అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్‌లో చేరికలు 

పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా 

VIDEOS

logo