సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 21:30:57

గోదాదేవి రంగనాథుల కల్యాణానికి హాజరైన మంత్రి

గోదాదేవి రంగనాథుల కల్యాణానికి హాజరైన మంత్రి

 నిర్మల్ అర్బన్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట వెంకటేశ్వరస్వామి దేవాలయంలో గోదాదేవి సమేత శ్రీ రంగనాథుల స్వామి కల్యాణం బుధవారం ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వరాలయంలో నిర్వహించిన వేడుకలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయం లో కళ్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణానికి  దేవాదాయ శాఖ మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి  సతీసమేతంగా హాజరై స్వామి వారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.

 కళ్యాణం లో పాల్గొని  ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామి వారి ఆశీస్సులతో అన్ని రంగాల అభివృద్ధితో పాటు నిర్మల్ అభివృద్ధి లో ఇంకా  ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. కల్యాణోత్సవానికి పట్టణంలోని భక్తులు భారీ సంఖ్యలో హాజరై తిలకించారు.