సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 17:26:24

యాదాద్రిలో వైభవంగా నిరటోత్సవం

యాదాద్రిలో వైభవంగా నిరటోత్సవం

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయంలో ఆదివారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాళ్‌ అమ్మవారికి నిరటోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేకంగా అలకంరించి శ్రీరంగనాధుడిని ప్రసన్నం చేసుకునే వేడుకలు చేపట్టారు. గోదాదేవికి మహిళ భక్తులు మంగళహారతులతో నీరాజనాలు పలికారు. అమ్మవారు స్వామివారి కలిసి మంగళస్నానాన్ని ఆచరిస్తారని, అనంతరం కల్యాణం జరుగబోతున్న నేపథ్యంలో ఈ నిరాటోత్సవాలు జరుపుతున్నారని, ఆదివారం నుంచి ఐదురోజుల పాటు నిరటోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు నల్లంధీగల్‌ లక్ష్మీనరసింహచార్యులు తెలిపారు.

ధనుర్మాసోత్సవం 26వ రోజులో భాగంగా బాలాలయంలో వేకువజామూనే ఆలయ అర్చకులు వేద మంత్రాలను పటిస్తూ తిరుప్పావై పూజలు అత్యంత వైభవంగా చేపట్టారు. అర్చకులు గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠించి భక్తులకు వినిపించారు. 

ఇవి కూడా చ‌ద‌వండి

భయపడొద్దు..బాగవుతుంది 

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్న‌ తొలి న‌టి ఎవ‌రంటే..?

పెండ్లి పీట‌లెక్కిన టాలీవుడ్ హీరోయిన్logo