హెంగెలో (నెదర్లాండ్స్): మహిళల 10 వేల మీటర్ల పరుగులో నెదర్లాండ్స్ అథ్లెట్ సిఫాన్ హసన్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. ఆదివారం ఇక్కడ జరిగిన బ్లాంకెర్స్-కొయిన్ గేమ్స్‌లో 10వేల మీటర్ల లక్ష్యాన్ని సిఫాన్ 29 నిమిషాల 6.82 సెకన్లలోనే దాటింది. తద్వారా 2016 రియో ఒలింపిక్స్‌లో ఇథియోపియా స్ప్రింటర్ అల్మాజ్ అయానా (29:17.45) నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టింది. 2019లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన హసన్ టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నది.