మెట్టుగుట్టపై జైన ఆనవాళ్లు

- మడికొండలో ధర్మనాథుడి పాదముద్రలు లభ్యం
వరంగల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాకతీయుల సామ్రాజ్యం పరిధిలో జైన ఆనవాళ్లు మరోచోట వెలుగుచూశాయి. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని మెట్టుగుట్టపైన ధర్మనాథుడి పాదముద్రలు లభ్యమయ్యాయి. జైన తీర్థంకరుల్లో 15వ వాడు జినబ్రహ్మయోగి(ధర్మనాథుడి) పాదముద్రలు, ప్రతిమ మెట్టుగుట్టపై ఉన్నాయని తెలంగాణ జాగృతి చరిత్ర బృందం సభ్యుడు సముద్రాల సునీల్ తెలిపారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట, మడికొండ ప్రాంతాల్లో జైనమత ప్రాభవానికి సాక్ష్యాలుగా ఎన్నో శిథిల జైన మందిరాలు, శిల్పాలు ఉన్నాయని.. మడికొండ మెట్టుగుట్టపైనా ధర్మనాథుడి ప్రతిమ, పాదాలు గుర్తించినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రకూటుల కాలంలో వరంగల్ ప్రాంతాన్ని పరిపాలించిన కొలనుపాక మహామండలేశ్వరుడు శంకరగండరస 888వ సంవత్సరంలో జైన గుడులను, జైనబసదులను నిర్మించిన ఆధారాలు మెట్టుగుట్టపై కనిపించాయని వెల్లడించారు. మెట్టుగుట్టపై జినబ్రహ్మజోగి లఘుశాసనం, ధర్మనాథుని ప్రతిమ, పాదాలు అప్పుడే చెక్కినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నదని సునీల్ వివరించారు.
తాజావార్తలు
- హెచ్-1బీపై ట్రంప్.. జో బైడెన్ వైఖరి ఒకటేనా?!
- నరేంద్ర చంచల్ మృతి.. ప్రధాని సంతాపం
- గంటవ్యవధిలో భార్యాభర్తల ఆత్మహత్య..
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం
- వాహనదారులకు భారం కావొద్దనే వాహన పన్ను రద్దు
- మందిర్ విరాళాల స్కాం : ఐదుగురిపై కేసు నమోదు
- మహా సర్కార్ లక్ష్యంగా పీఎంసీ దర్యాప్తు: ఎమ్మెల్యే ఇండ్లపై ఈడీ దాడులు
- గౌడ సంఘాల నాయకులకు జీఓ కాపీ అందించిన మంత్రి
- రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి హరీశ్ రావు
- ఆస్పత్రి నుంచి కమల్‌హాసన్ డిశ్చార్జ్