శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 18:45:36

శాస్ర్తోక్తంగా స్వామివారి నిత్యకల్యాణం

శాస్ర్తోక్తంగా స్వామివారి నిత్యకల్యాణం

యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాయంలో గురువారం అర్చకులు స్వామివారి నిత్యకల్యాణం శాస్ర్తోక్తంగా చేపట్టారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామిఅమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమంను ఆగమశాస్త్రం చేపట్టారు.

కొండపైన ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.logo