సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 16:57:28

నాచగిరిక్షేత్రంలో కార్తీక వైభోగం

నాచగిరిక్షేత్రంలో కార్తీక వైభోగం

సిద్దిపేట : వర్గల్‌ మండలంలోని నాచగిరి లక్ష్మీనృసింహస్వామి దివ్యక్షేత్రం సోమవారం సత్యదేవుని వ్రతమహాత్మ్యంతో పునీతమైంది. ఆలయంలో వేద పండితుల సమక్షంలో మూలమంత్ర హవనం, అభిషేకాలు జరిగాయి. దీక్షలు,ఉపవాసాలు, కల్యాణాలు, ముడుపుల చెల్లింపుతో నాచగిరిలోని శ్వేతగిరి పరిసరాలు ఆధ్యాత్మిక ప్రపత్తులను సంతరించుకుంది. కార్తీకమాసం పౌర్ణమి కావడంతో ఉదయమే పుష్కరిణి స్నానగుండంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.

దేవతామూర్తుల దర్శనంతరం స్వామివారి పేరిట వ్రతాలు జరిపించకునేందుకు  భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. సత్యనారాయణస్వామి వ్రత మండపం  భక్తులతో రద్దీగా మారింది. మరో పక్క ధ్వజస్తంభం వద్ద మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్వామివారి సన్నిధిలో కళ్యాణాలు జరిపించారు. కొవిడ్‌-19 నిబంధనల దృష్ట్యా  మాస్క్‌లు ధరించినవారికే ఆలయంలోకి అనుతించారు.