ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 16:43:01

భక్తజన సంద్రం..తుంగభద్ర పుష్కర ఘాట్లు

భక్తజన సంద్రం..తుంగభద్ర పుష్కర ఘాట్లు

జోగులాంబ గద్వాల /ఆలంపూర్‌ : తుంగభద్ర పుష్కరాలు 11వ రోజుకి చేరుకోవడంతో భక్తులతో ఆలంపూర్ తుంగభద్ర పుష్కర ఘాట్ జనసంద్రంగా మారింది. అలాగే 5వ శక్తి పీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగ భద్రా పుష్కరాలు తుది దశకు చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పుష్కర స్నానానికి తరలివస్తున్నారు.

కార్తీక సోమవారం కావడంతో భక్తులు పుష్కర స్నానం ఆచరించి దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో నదిలో వదులుతున్నారు. ఆలంపూర్‌లోని 5వ శక్తి పీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాల దర్శనానికి భక్తులు ఉదయాన్నే బారులు తీరారు.