ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 12:33:15

కాళేశ్వర- ముక్తేశ్వర ఆలయంలో భక్తుల సందడి

కాళేశ్వర- ముక్తేశ్వర ఆలయంలో భక్తుల సందడి

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాళేశ్వర -ముక్తేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నది. కార్తీక మాసంలో వచ్చిన శని త్రయోదశి సందర్భంగా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేస్తున్నారు. కోరిన కోరికలు తీర్చాలని తమ ఇష్ట దైవానికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులు నవగ్రహల వద్ద  పూజల కోసం భక్తులు బారులు తీరారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఆలయ కమిటీ తగు ఏర్పాట్లను పూర్తి చేసింది.