ఆపదలో ఆపన్న హస్తం

- బాధిత కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా
- వెంటనే డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు
సిరిసిల్ల కలెక్టరేట్: ఆపదలో ఉన్న ఓ కుటుంబానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆపన్నహస్తం అందించారు. పెద్ద దిక్కును కోల్పోయి నిలువ నీడ లేక అవస్థలు పడుతున్న ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుచేసి అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలోని పూరిగుడిసెలో కుటుంబంతో కలిసి ఉంటున్న ఇస్కిల్ల రాజయ్య అనారోగ్యంతో ఈనెల 21న మృతిచెందాడు. అతడికి భార్య జ్యోతి, తల్లి ఆగవ్వ, సంతానం అర్చన, నవ్య, అరవింద్ ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబానికి ఇల్లు కూడా లేకపోవడంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు టెంట్ కిందనే చేశారు. వారి పరిస్థితిని స్థానిక నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి.. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసిన పత్రాన్ని కలెక్టర్ గురువారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మంత్రి కేటీఆర్, కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు