సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 18:44:04

‘టీఆర్‌ఎస్‌కు మద్దతుగా గౌడ ఆత్మీయ సమ్మేళనం’

‘టీఆర్‌ఎస్‌కు మద్దతుగా గౌడ ఆత్మీయ సమ్మేళనం’

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేస్తామని తెలంగాణ గౌడ సంఘం నాయకులు తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గౌడన్నల సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిందని రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 18 మంది గౌడ్‌లకు సీట్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. వారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు.

టీఆర్‌ఎస్‌కు మద్దతుగా రేపు హైదరాబాద్‌లోని జలవిహార్‌లో గౌడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామన్నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్  గౌడ్, గౌడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గౌడ సంఘం నేతలతో పాటు భారీగా గౌడ కులస్తులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్, బాలగోని  బాల రాజ్ గౌడ్, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు చింతల మల్లేష్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్,  ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.