సోమవారం 08 మార్చి 2021
Telangana - Nov 25, 2020 , 17:35:49

మతం పేరుతో చిచ్చుపెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలి

మతం పేరుతో చిచ్చుపెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలి

హైదరాబాద్‌ : ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మతం పేరుతో విడగొట్టే ప్రయత్నాలను చేస్తున్న బీజేపీ నాయకులకు ఓటుతో బుద్ది చెప్పాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఎంపీ కేకే నివాసం వద్ద ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి బీజేపీ నేతల ప్రసంగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామంటూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న బీజేపీ నేతల తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరేళ్లుగా అధికారంలో ఉండి రాష్ర్టానికి చేసిన మేలేంటో హైదరాబాద్‌ నగరానికి వారి వల్ల కలిగిన ఉపయోగమేంటో చెప్పాలని సవాల్‌ విసిరారు. బీజేపీ చిల్లర మాటలను ప్రజలు నమ్మరని గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కచ్చితంగా వంద సీట్లు రావడం ఖాయమన్నారు. 

VIDEOS

logo