ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 13:29:04

పేదింటి ఆడబిడ్డ పెండ్లికి మంత్రి కొప్పుల చేయూత

పేదింటి ఆడబిడ్డ పెండ్లికి మంత్రి కొప్పుల చేయూత

జగిత్యాల : పేదింటి ఆడబిడ్డ పెండ్లికి అండగా నిలిచారు మంత్రి కొప్పుత ఈశ్వర్‌ దంతపతులు. జిల్లాలోని గొల్లపల్లి మండలం లొత్తునూరుకు చెందిన పేదింటి ఆడబిడ్డ వరలక్ష్మి పెండ్లికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ధర్మపత్ని స్నేహలతతో కలిసి పూలు,పండ్లు, పసుపుకుంకుమలు, పట్టుచీరతో పాటు 15,000రూపాయలు అందజేశారు. కాగా, ఈ దంపతులు ఎల్.ఎం.కొప్పుల చారిటబుల్ ట్రస్టును నెలకొల్పి కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.