బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 01:58:28

పెండ్లికి ముందే బిడ్డకు లాంఛనం

పెండ్లికి ముందే బిడ్డకు లాంఛనం

ధర్మసాగర్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం ముప్పారానికి చెందిన అన్నం లక్ష్మీనారాయణ.. తన బిడ్డకు పెండ్లికి ముం దే లాంఛనం ఇచ్చా డు. డిగ్రీ చివరి సం వత్సరం చదువుతున్న తన కూతురు   శ్రీలేఖకు మూడేండ్ల లో పెండ్లి చేయాలనుకుంటున్నాడు. ముందుచూపుతో తనకున్న నాలుగెకరాల నుంచి 18 గుంటల భూమిని శ్రీలేఖ పేరు మీదికి మార్చేందుకు ధరణి ద్వారా శుక్రవారం స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. శనివారం 20 నిమిషాల్లో రిజిష్ర్టేషన్‌ పూర్తయింది. బిడ్డ పెండ్లి వరకు ఇబ్బందులు ఉండకుండా ఇప్పుడే ఆమెకు కట్నంగా ఇవ్వాలనుకుంటున్న భూమిని ఆమె పేరిట చేయించానని లక్ష్మీనారాయణ చెప్పాడు.

పంచి పన్నెండేండ్లు.. ఇప్పుడు పట్టా

ధర్మసాగర్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం సోమదేవరపల్లికి చెందిన మెట్ల రాములుకు 4.20 ఎకరా ల భూమి ఉన్నది. పెండ్లిళ్లు అయిన అత డి ముగ్గురు కొడుకులు వెంకటస్వామి, లక్ష్మీనారాయణ, సాంబరాజుకు పన్నెండేండ్ల కిందటే భూమిని పంచాడు. అప్పుడు వీరి పేరిట పట్టా మార్చాలం టే 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘన్‌పూర్‌కు వెళ్లాల్సి వచ్చేది. జిల్లా ల ఏర్పాటు తర్వాత 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమదేవరపల్లికి పోవాల్సి వచ్చింది. మధ్యవర్తులను తీసుకెళ్తేనే పనవుతుందని చెప్పడంతో రిజిస్ట్రేషన్‌ చేయించలేదు. ధరణి వచ్చాక స్లాట్‌బుక్‌ చేసుకుని ధర్మసాగర్‌ తాసిల్దార్‌ ఆఫీస్‌కు వచ్చారు. కొంత సమయంలోనే పనిపూర్తయి రూపాయి ఖర్చు లేకుండానే కొడుకులు పట్టాదారులు కావడంతో రాములు సంబురపడ్డాడు.

జప్పున పనైంది

ఆత్మకూరు శివార్ల మాకు నాలుగు న్నర ఎకరాలుంది. మా అమ్మ నుంచి నాకు, మా అన్నకు భూమి చేసుకుంట మని.. అప్పట్ల షానా మందిని అడిగి నం. ఆడికి తిరుగాలె, ఈడికి తిరుగాలె, పట్వారీని కల్వాలె అని చెప్పిండ్రు. ఇప్పుడేమో నా అల్లుడు నిన్న మీసేవల దరఖాస్తు పెట్టిండు. పొద్దుగాల ఆఫీసుకు పోవాలె అన్నడు. పొయినంక అద్దగంటల అంత పనయిపోయింది. మా అమ్మకు వేలిముద్రలు పడనీకె కొంచెం లేటయింది. కండ్లతోటి సూయించి పని చేసేసిండ్రు. పత్రాలు కూడా అప్పుడే ఇచ్చిండ్రు. కేసీఆర్‌ సారు తెచ్చిన ధరణి తోటి పని జప్పునైంది. సారు సల్లగుండాలె.

  - గడ్డం రాములు, ఆత్మకూరు, వనపర్తి జిల్లా