బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 02:30:02

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌'లో సవరణ

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌'లో సవరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌' మార్గదర్శకాల్లో రాష్ట్ర కార్మికశాఖ పలు సవరణలు చేసింది. లైసెన్స్‌ ఫీజు, డిపాజిట్‌లు డిసెంబర్‌ 31లోగా చెల్లించి, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కార్మికశాఖ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. దీని ప్రకారం ‘ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌'లో చేరాలనుకునే కర్మాగారాలు ఈ కింది నిబంధనలు పాటించాలని తెలిపింది. 

1. ఫ్యాక్టరీ నిర్ణీత సమయంలో లైసెన్స్‌ ఫీజు చెల్లించాలి.

2. గత ఐదేండ్లలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే వాటి వివరాలు తెలుపాలి.

3. గత రెండేండ్లలో ఏదైనా తీవ్ర ప్రమాదం జరిగి ఎవరికైనా అంగవైకల్యం ఏర్పడినా, లేదా మంటలు చెలరేగినా, పేలుళ్లు సంభవించినా వాటి వివరాలు స్వచ్ఛందంగా  నమోదు చేయాలి. 


స్వీయ ధ్రువీకరణ- థర్డ్‌పార్టీ  పథకం కింద అప్‌లోడ్‌ చేయాల్సినవి..

తక్కువ రిస్క్‌ కల్గిన ఫ్యాక్టరీలు ఐదేండ్లకు ఒకసారి. మధ్యస్థ ప్రమాద కర్మాగారాలు రెండు సంవత్సరాలకు ఒకసారి. భారీ ప్రమాదాలకు ఆస్కారం ఉన్న కర్మాగారాలు సంవత్సరానికి ఒకసారి నమోదు చేయాలి.

దరఖాస్తుతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌, చెక్‌లిస్ట్‌ స్వీయ ధృవీకరణ, థర్డ్‌ పార్టీ ధ్రువీకరణ కోసం కర్మాగారాల తనిఖీ ఈ క్రింది విధంగా ఉంటుంది....

  • తక్కువ రిస్క్‌ ఫ్యాక్టరీలు :   రూ.5 వేలు
  • 50 మంది కార్మికులు పనిచేసే మధ్యస్థ రిస్క్‌ ఫ్యాక్టరీలు : రూ. 10వేలు
  • 51-150 మంది కార్మికులు పనిచేస్తున్న మధ్యస్థ రిస్క్‌ ఫ్యాక్టరీలు : రూ. 20 వేలు 
  • 500 మంది వరకు పనిచేసే అధిక రిస్క్‌ ఫ్యాక్టరీలు : రూ. 50వేలు 
  • 500 మంది కార్మికులు పనిచేసే పెద్ద ప్రమాదాలు, విపత్తుల కర్మాగారాలు : రూ. 1 లక్ష 
  • అధిక రిస్క్‌ ఫ్యాక్టరీలు (ఎక్కువ మంది పనిచేసే ఫ్యాక్టరీలు, పెద్ద ప్రమాదాలు జరిగే కర్మాగారాలు) : రూ.50 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి.