మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 18:45:49

ధరణి పోర్టల్‌ రైతుల పాలిట వరం : వంగా రవీందర్‌రెడ్డి

ధరణి పోర్టల్‌ రైతుల పాలిట వరం : వంగా రవీందర్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంలో భాగమైన ధరణి పోర్టల్‌ రైతుల పాలిట వరం లాంటిదని, రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆయన రాష్ట్ర కమిటీ ప్రతినిధులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ నూతన రెవెన్యూ చట్టానికి గుండెకాయ లాంటిదన్నారు. ఈ విధానం లేక గతంలో రెవెన్యూ ఉద్యోగులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారని, నేడు ఈ విధానం రెవెన్యూ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచుతుందన్నారు. ఈ విధానానికి మా సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గౌతమ్‌ కుమార్‌, కార్యదర్శి బాణాల రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.