శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 18:51:03

కోట గోడను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

కోట గోడను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

జనగామ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోట గోడ కొంత భాగం కూలిపోయింది. విషయం తెలుసుకున్న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ హుటాహుటిన  ఖిలాషాపూర్ చేరుకున్నారు. స్థానిక శాసన సభ్యుడు డా. టి. రాజయ్య, ఎంపీ పసునూరి దయాకర్‌తో కలసి పరిశీలించారు. త్వరలోనే కోటకు మరమ్మతులు చేపడుతామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, జిల్లా కలెక్టర్ నిఖిల, తెలంగాణ హెరిటేజ్ శాఖ అధికారులు నారాయణ, టూరిజం అధికారులు శివాజీ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.


తాజావార్తలు