మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 15:07:27

సుజాత వెంటే మేమంటూ నినదించిన చిట్టాపూర్ గ్రామస్తులు

సుజాత వెంటే మేమంటూ నినదించిన చిట్టాపూర్ గ్రామస్తులు

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచారంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత దుసుకెళ్తున్నది. ఏ ఊరికెళ్లినా ప్రజలు తమ సొంత మనిషిలా అక్కున చేర్చుకుంటున్నారు. చిట్టాపూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సుజాతను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా సుజాత గ్రామస్తులను ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు.నా ఊరులో నేను ఎం మాట్లాడను. ఊరి ప్రజలను చూస్తే ఏడుపు వస్తుంది.  

రామలింగన్న 20 ఏండ్లు ఊరికి సేవ చేసిండు. మంచి, చెడులో భాగస్వామ్యం అయ్యాం. నేను ఓట్ల కోసం ఏడుస్తలేను. రామలింగన్న యాదికి వస్తుండు. నేను నామినేషన్ వేసి ఇక్కడికి వచ్చిన. మన ఊరి ఐక్యతను చాటాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. దీంతో గ్రామస్తులంతా మా ఊరి బిడ్డకు మేమే అండగా ఉంటామని ముక్తకంఠంతో నినదించారు. ప్రచారంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.logo