శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 16:26:07

రైతువేదికల నిర్మాణ పనులను పరిశీలించిన జడ్పీ చైర్ పర్సన్

 రైతువేదికల నిర్మాణ పనులను పరిశీలించిన జడ్పీ చైర్ పర్సన్

వరంగల్ రూరల్  : జిల్లాలోని శాయంపేట మండల కేంద్రం, ప్రగతి సింగారం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన రైతువేదికల నిర్మాణ పనులను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి పరిశీలించారు. పనులను గడువు లోగా నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట స్థానిక ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.


logo