ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 19:25:39

'అభివృద్ధి, సంక్షేమంలో తుడిచిపెట్టుకుపోతున్న ప్ర‌తిప‌క్షాలు'

'అభివృద్ధి, సంక్షేమంలో తుడిచిపెట్టుకుపోతున్న ప్ర‌తిప‌క్షాలు'

ఖమ్మం : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకు పోతున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం రజబెల్లినగర్ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక సర్పంచ్ బోడా శరత్ కుమార్ తోపాటు ఉప సర్పంచ్ జి. నర్సింహ రావు, వార్డు సభ్యులు బాణోత్ వీరన్న, భూక్య బుజ్జి, మలోత్ భోరా, నాయకులు వీరన్న, బోడా శ్రీను, బాణోత్ కొండయ్య, బోడా శ్రీను, మాణిక్య రావు, టి రమేష్, వెంగల్ రావు, తార చంద్ తో పాటు 150 కుటుంబాలు టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. మంత్రి వీరికి గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి అజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రాన్ని సాధించి, తెలంగాణను అన్ని రంగాలలో ప్రగతిపథాన నడిపిస్తున్న సీఎం కేసీఆర్ మహోన్నత నాయకులు అని కొనియాడారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అన్నారు. కాంగ్రెస్, బీజెపీలు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయన్నారు. కేసీఆర్ సుపరిపాలనకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, నాయకులు తాత మధు, మండల అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు, మండదపు నర్సింహారావు, మండదపు సుధాకర, భూక్య లక్ష్మణ్ నాయక్, వీరు నాయక్ తదితరులు ఉన్నారు.


logo