గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 17:14:25

పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి

పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి

వరంగల్ రూరల్ : 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఆరేండ్ల పాలనలో చేసి చూపించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మండలంలోని సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సమస్యలపై గ్రామాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని గ్రామాల్లో చేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు. పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.


logo