శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 11:46:44

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్ లో చేరికలు

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్ లో చేరికలు

వరంగల్ రూరల్ : కాంగ్రెస్ ను వీడి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. తాజాగా పరకాల మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బండారి రేణుక, వార్డు మెంబర్లు బొచ్చు తిరుపతి, పసుల దేవేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో చేరిన వారికి ఎల్లపుడు పార్టీ అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేష్, రైతు కో ఆర్డినేటర్ నాగుల అశోక్, టీఆర్ఎస్ నేతలు బొల్ల శ్రీనివాస్, దోమల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.