బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 11:43:43

సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

హైదరాబాద్ : గత ప్రభుత్వాలు 70 ఏండ్లు పరిపాలించి ప్రజలకు దిక్కు, దివానం లేకుండా చేశాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బోరబండ సైట్ 2 కాలనీలో జీహెచ్ఎంసీ  ఆధ్వర్యంలో నూతనంగా రూ.25.5 లక్షల తో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అలాగే అక్కడే రూ.90 వేలతో నెలకొల్పిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేడు దేశం మొత్తం చూపు  సీఎం కేసీఆర్ వైపు ఉందని పేర్కొన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 105 సీట్లు రావడం ఖాయమన్నారు. కుల, మత రాజకీయాలకు కేసీఆర్ చరమ గీతం పాడారని ప్రశంసించారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే  గోపీనాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


logo