బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 18:46:15

పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి : మంత్రి ఎర్రబెల్లి

పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్ : ప‌ల్లె ప్రగతి కార్యక్రమంతోనే ప‌ల్లెలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని, ప‌ల్లెలు పచ్చదనం ప‌ర‌చుకుని-ప‌రిశుభ్రతతో మెరవడం వల్లే మ‌న రాష్ట్రానికి జాతీయ స్థాయిలోనూ అవార్డులు ద‌క్కుతున్నాయ‌ని  పంచాయ‌తీరాజ్ రాశాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ‌వ‌ర్ధన్నపేట నియోజ‌క‌వ‌ర్గంలోని ఉప్పరప‌ల్లిలో ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని ర‌వీంద‌ర్ రావుతో క‌లిసి డంపింగ్ యార్డుని మంత్రి ప్రారంభించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..పల్లె ప్రగతితో గ్రామాలు పచ్చగా మారుతున్నాయని తెలిపారు. నిరంత‌రం నిర్విహిస్తున్న పారిశుద్ధ్యం కార‌ణంగా క‌రోనా వైర‌స్ పారిపోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. అలాగే సీజ‌న‌ల్ వ్యాధులు పూర్తిగా అదుపులో ఉన్నాయ‌న్నారు. అందుకే మ‌న రాష్ట్రానికి అనేక అవార్డులు వ‌స్తున్నాయ‌ని మంత్రి చెప్పారు. ఇదంతా సీఎం కేసీఆర్ రూపొందించి, అమ‌లు చేస్తున్న పల్లె ప్రగతితోనే సాధ్యమైందన్నారు. 


logo