గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 14:40:05

నల్ల నరసింహులు చరిత్రలో నిలిచిపోతారు : మంత్రి ఎర్రబెల్లి

నల్ల నరసింహులు చరిత్రలో నిలిచిపోతారు : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు చరిత్రలో నిలిచిపోతారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నల్ల నరసింహులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాళలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నిజాం నవాబు నిరంకుశ పాలనను గడగడలాడించిన యోధుడు నల్ల నరసంహులు అన్నారు. వెట్టిచాకిరి విముక్తి కోసం సబ్బండ వర్ణాలను ఐక్యం చేసి రజాకార్లను ఎదురించాడని తెలిపారు. నరసింహులు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన వారు కావడం నాకు చాలా గర్వంగా ఉందన్నారు.


logo