మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 02:02:54

ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకే మా మద్దతు

ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకే మా మద్దతు

  • ప్రజాప్రతినిధుల ఏకగ్రీవ తీర్మానాలు

మోర్తాడ్‌/ఇందల్వాయి/నిజామాబాద్‌ రూరల్‌/బోధన్‌/లింగంపేట: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానాలు జోరందుకున్నాయి. గురువారం నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్‌, జెడ్పీటీసీ సభ్యుడు బద్ధం రవి ఆధ్వర్యంలో ఎంపీటీసీ సభ్యులు తీర్మానం చేశారు. ఈ ప్రతిని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియాకు అందజేశారు. 


logo